TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా మావోయిస్టు సిద్ధాంతాలను, విసిగిపోయి జనజీవన స్రవంతిలో మావోయిస్టు సభ్యులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట పదిమంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు, విసిగిపోయి జనజీవన స్రవంతిలోకి కలిసిపోయిన సిపిఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన, డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM) -1, ఏరియా కమిటీ సభ్యురాలు (ACM)-1, ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు (PPCM)-3, DAKMS RPC అధ్యక్షుడు-1, RPC మిలిషియా సభ్యుడు -1, మిలిషియా కమాండర్ -1, RPC చైతన్య నాట్యమండలి (CNM) సభ్యుడు-1 మరియు RPC బాలలసంఘం సభ్యుడు -1 లొంగిపోయారని అన్నారు. వారికి పోలీస్ శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా సాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా, అడిషనల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీసు (ఆపరేషన్స్), జగదీష్ ఆడహల్లీ , అదనపు ఎస్పీ దిరాజ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tired of Maoist ideology