TRINETHRAM NEWS

ములుగు జిల్లా ఏప్రిల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ములుగు జిల్లాలో మరో సారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది మేడారం పరిసర అడవుల్లో పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు పులి పాద ముద్రలు అను సరించి మేడారం, బయ్యక్క పేట, అడవుల్లో పులిజాడ కోసం వెతుకుతున్నారు అటవీశాఖ అధికారులు. మహదేవ్ పూర్ మండలం గొత్తికోయగూడెంలో ఆవును చంపి మేడారం వైపు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు అడవిలోకి ఎవరూ ఒంటరి గా వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.

పులి ఆనవాళ్ళు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. గతంలో కూడా ములుగు జిల్లాలోని ములుగు, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి అప్పట్లో తాడ్వాయి మండలంలోని కామారం అటవీ ప్రాంతంలో ఓ పెద్ద పులి పశువుల మందపై దాడికి ప్రయత్నించింది. ఆ తరువాత మంగపేట మండ లంలో ఓ లేగ దూడపై దాడి చేసి, చంపేసింది. కొద్ది రోజులకు మంగపేట మండలంలోని శ్రీరాంనగర్ గొత్తికోయ గూడెం సమీపం లో మేత కోసం వెళ్లి ఆవుల మందపై కూడా పెద్ద పులి దాడికి దిగింది.

ఈ దాడిలో ఓ లేగ దూడ మృత్యు వాత పడింది పులి కదలికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించ డానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మరియు సమీప గ్రామాల నివాసితులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. పశువులను మేప డానికి ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని అటవీ అధికారు లు గ్రామస్తులను హెచ్చరించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tiger roaming in Medaram