TRINETHRAM NEWS

కోనసీమ జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు ముగ్గురు మృతి

Trinethram News : కోనసీమ జిల్లా : డిసెంబర్ 10
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది, పి గన్నవరం మండలం ఊడిమూడి చింతవారిపేట వద్ద అదు పుతప్పి కారు కాలువలో దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నేలపూడి విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో విశాఖఫట్నం నుంచి పి గన్నవరంలోని పోతవరం వెళ్తున్న క్రమంలో ఊడి మూడి శివారులోని చింతావారి పేట గ్రామ సమీపంలోకి రాగానే పొగ మంచుతో రోడ్డు కనిపించక కారు అదుపుతప్పి కాలువ లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందగా భర్త బ్రతికి బయటపడ్డాడు, అయితే ప్రమాద సమయంలో విజయ భాస్కర్ భార్య ఉమా, కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు సమాచారం.

గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App