Trinethram News : నారాయణఖేడ్ : ఖేడ్ పట్టణంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేటు ఆసుపత్రులు సీజ్ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. గురువారం ఆమె పట్టణంలోని ప్రైవేటు ఆసుత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష క్లినిక్, శ్రీసాయివాణి, హెల్త్‌పాయింట్ ఆసుపత్రులకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించి వాటిని సీˆజ్ చేసినట్లు పేర్కొన్నారు. హెల్త్‌పాయింట్ క్లినిక్‌లో 10 మంది వరకు రోగులు ఉండగా తనిఖీని పసిగట్టిన ఆసుపత్రి నిర్వాహకులు.. రోగులను అందులోనే ఉంచి తాళాలు వేసి వెళ్లారన్నారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో యాజమాన్యం ప్రతినిధులు వచ్చి తాళాలు తీసి రోగులను బయటకు పంపించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 వరకు అనుమతి లేని ఆసుపత్రులను సీˆజ్ చేసినట్లు వివరించారు. అన్ని ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ ద్వారా అనుమతి పొందాల్సిందేనని స్పష్టం చేశారు…….
ఖేడ్ లో మూడు ఆసుపత్రులు సీజ్
Related Posts
రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు
TRINETHRAM NEWS రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు పంటలకు గాను రూపాయలు 12000 రైతు భరోసా అందిస్తున్నందుకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్…
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
TRINETHRAM NEWS ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు Trinethram News : సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో…