జూన్ 28, 2026

WhatsApp Image 2023 12 20 at 8.11.10 AM

TRINETHRAM NEWS

మూడు రోజులు చలి తీవ్రత

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. మరో మూడు రోజులు మరింత పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది.

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా పెంబిలో 13.1డిగ్రీలు, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 13.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9 డిగ్రీలు, మంథడపల్లి జిల్లా 13.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజామున పొగమంచు కురుస్తున్నది. దీంతో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 17.9 డిగ్రీ లుగా నమోదైంది.

You cannot copy content of this page