Irugadhindla Krishna : స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలి.

TRINETHRAM NEWS

ఇరుగధిండ్ల కృష్ణ. -దేవరకొండ నియోజకవర్గ వడ్డెరసంఘం అధ్యక్షులు.

దేవరకొండ డివిజన్ నవంబర్ 11 త్రినేత్రం న్యూస్.

తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర కులానికి సంబంధించిన 32 లక్షల మంది వడ్డెర కులస్తులు ఉన్నారు గ్రామపంచాయతీ జెడ్పిటిసి ఎంపీటీసీ రిజర్వేషన్స్ ఖరారు అయినాయి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికలు రిజల్ట్ అయిపోగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో దేవరకొండ నియోజకవర్గం లో ఎనిమిది వేల మంది వడ్డెర కులస్తులు ఉన్నారు బీసీ రిజర్వేషన్ ఉన్నచోట సర్పంచి జెడ్పిటిసి ఎంపీటీసీ వడ్డెర కులస్తులకు పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నారు .వారికి టికెట్లు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ బలమైన అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ పార్టీల వారు మాకు టికెట్లు కేటాయించాలి కేటాయించని యెడల మా సత్తా ఏమిటో చూపిస్తాం ఏ పార్టీ అయితే మా వడ్డెర కులానికి కేటాయిస్తారో వారిని ఆ పార్టీకి మా కులస్తుల పోటీ మద్దతు తెలుపుతాము ఆర్థికంగా అన్ని రకాలుగా మా యొక్క కులస్తులకు స్తోమత ఉన్నది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. వడ్డే రసంఘం నియోజక వర్గ అధ్యక్షులు ఇరుగదిండ్ల కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ట్రస్టు చైర్మన్ శివరాత్రి ఆయిల్ మల్లు అధ్యక్షతన ఈనెల 20 తేదీన హైదరాబాదులో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని జిల్లాల నియోజకవర్గాల అందరూ హాజరు కానున్నారు ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల లిస్ట్ ని తయారు చేస్తున్నాము కాబట్టి దేవరకొండ నియోజకవర్గం నుండి సుమారు పోటీకి సిద్ధంగా ఉన్న అభ్యర్థు లు అందరూహైదరాబాదుకు బయలుదేరుచున్నాము కాబట్టిఅందరూహాజరుకావాలని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

chance in local body elections

You cannot copy content of this page

Scroll to Top