TRINETHRAM NEWS

The leaders of Nandipet Mandal staged a dharna against the statue of Mother Telangana in front of the Assembly, demanding that the statue of Mother Telangana not be removed.

త్రినేత్రం న్యూస్ నందిపేట్ మండల్ నిజాంబాద్ డిస్టిక్ : నందిపేట్ మండల రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిజాంబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్వోన్నత సచివాలయం ముందర నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానపరిచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైఖరి నిరసిస్తూ వెల్మల్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నెహ్రూ గాంధీ కుటుంబం

ఈ దేశాన్ని దోపిడీ చేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఉనికి ఎటువంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కుట్రపూరితంగా కేవలం అధిష్టానం మెప్పు పొందడానికి ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకున్నారని రాబోయే కాలంలో మీకు తగిన గుణపాఠం చెబుతారని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజన్న, సీనియర్ నాయకులు బాలగంగాధర్, దేవేందర్, రామారావు, మనోజ్ రావు, కేజీ సురేష్ ,సురేందర్, ప్రవీణ్, తల్వేద రాము, నాగరావు, దారం సురేష్, రఫిక్, శంకర్, భూమేష్, లక్ష్మణ్, కోట జాన్, భరత్ ,నరేష్, గంగాధర్ ,చిలుక భూమేష్ ,దాసు కృష్ణ అశోక్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

The leaders of Nandipet Mandal staged a dharna against the statue of Mother Telangana in front of the Assembly, demanding that the statue of Mother Telangana not be removed.