రాజ్యాంగం అమలుకు ప్రశ్నించే తత్వం ఉండాల్సిందే. సర్పంచ్లసంగం నేత కె రాజిరెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దోమ.
రాజ్యాంగం అమలు పూర్తి స్థాయిలో అందాలంటే ప్రతి పౌరుడు ప్రశ్నిస్తూ ఉండాల్సిందే నని అందుకు పాఠశాల స్థాయిలో విద్యార్థులను ప్రోత్సాహించాలని దోమ మండల సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి సూచించారు ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా ఆదివారం దోమ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు ఏళ్ళు వచ్చిన ఇంకా ఆశించిన స్థాయిలో ఫలాలు అందడం లేదని అందుకు కారణం దేశ రాష్ట్ర శాసన చట్టం సభ్యుల నిర్లక్షమేనన్నారు విద్యార్థులు కష్టపడి చదివితే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో అనేక అవకాశాలు ఉంటాయని
రాజిరెడ్డి విద్యార్థులకు సూచించారు మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థులు భవిషత్తులో బాగుపడాలి అంటే ఉపాధ్యాయులు చెప్పిన విదంగా శ్రేద్దగా చదువుకోవాలి అన్నారు ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల బాగు కోసం మా ఉపాధ్యాయ బృందం తో కలిసి ఉత్తమ ఫలితలా కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు విశ్రాంత ఉపాధ్యాయులు సి బుచ్చిరెడ్డి పదవ తరగతి లో పది కి పది పాయింట్స్ సాధిస్తే పదివేలు ఆర్థిక సహాయం ప్రకటించి అడ్వాన్స్ గా పది వేలు ప్రధానోపాధ్యాయులకు అందించారు కో ఆప్షన్ ఖాజాపాషా పూర్వ విద్యార్థులు రమేష్ బోస్ రమేష్ సీను భీమయ్య లు ఉపాద్యులను సన్మాంచి బహుమతులు అందజేశారు అంతకు ముందు గ్రామపంచాయతి తో పాటు పలు జెండా పండగ ఆవిష్కరణ కార్యక్రమల్లో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App