The goal of our government is the welfare of women
- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.
బషీరాబాద్ మండల ఎంపీడీవో కార్యాలయంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీ ద్వారా రూ.500 /- లకు గ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్దిదారులకు గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన, గుర్తింపు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
- పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో మాటిచ్చాడు, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా మాట నిలబెట్టుకున్నాడు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు.
- ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే మన ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
- యావత్తు తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరి ఆశీస్సులతో ఏర్పడిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం..
- ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది.
- పదేళ్ల బిఆర్ఎస్, బిజెపి పాలనలో మహిళలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని,మహిళ సంఘాలను నిర్లక్ష్యం చేశారు, పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదు, సిలిండర్ ధర రూ.400 నుండి రూ.1000 లు పెంచిన ఘనత గత ప్రభుత్వానిదేనని అన్నారు.
- గతంలో మహిళలకు చేయుతన అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే మహిళ సంఘాలకు పూర్వ వైభవం వచ్చిందని అన్నారు.
- ముఖ్యమంత్రి రేవంత్ గారు మహిళ సంఘాలను బలోపేతం చేసేందుకు ఇప్పటికే పావలా వడ్డీ రుణాలు పునః ప్రారంభించారు,అమ్మ ఆదర్శ కమిటీల్లో భాగస్వామ్యం చేశారు. సబ్సిడీ ద్వారా రూ.500 కే అందిస్తున్నామని, త్వరలో మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2500 రూపాయలు ఇస్తామని అన్నారు.
- సంబంధింత అధికారులతో మాట్లాడి అమ్మ ఆదర్శ కమిటి సభ్యులు చేసిన పనులకు త్వరలోనే డబ్బులు మంజూరు చేయడం జరిగిందని, అలాగే మహిళ సంఘం సభ్యుల విన్నపం మేరకు మహిళ సమాఖ్య భవనంకు 20 లక్షల రూపాయలు మంజూరు ఇస్తామని మాటిచ్చిన ఎమ్మెల్యే.
- ఏళ్ళ నుంచి వివాదంలో ఉన్న నీళ్ళపల్లి అటవీ భూముల వివాదంకు పరిష్కారం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే సొంతం.
- గత ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే బషీరాబాద్ మండలంలో పనులు ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల మార్కేట్ కమిటీ చైర్మన్ మాధవ రెడ్డి, వైస్ చైర్మన్ చందర్ సోసైటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, పార్టీ అధ్యక్షుడు కలాల్ నర్సింహులు గౌడ్, సీనియర్ నాయకులు వేంకటేష్ మహా రాజ్, మాజీ జడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శంకరప్ప తో పాటు డైరెక్టర్లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు , మహిళ సమాఖ్య సభ్యులు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.