TRINETHRAM NEWS

ప్రజాపాలనలో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 4 త్రినేత్రం న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఆదేశాల మేరకు నేడు అనగా శుక్రవారం రోజు గుండ్లపల్లి మండలం గోనబైన పల్లి దేవత్ పల్లి తండా గ్రామపంచాయతీలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ , మరియు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరుపుల లక్ష్మి విచ్చేసి లబ్ధిదారులకు సన్నబియ్యం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో సన్నబియ్యం పథకం పేదలకు ఒక వరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పథకం అమలు జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో డీలర్ గోపాల్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The welfare of the