TRINETHRAM NEWS

The use of tobacco products should be avoided according to Dr. Pramod Kumar, District Medical and Health Officer

పెద్దపల్లి, మే -31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మన ఆరోగ్యానికి తీవ్రంగా హానికరమైన పొగాకు వాడకాన్ని నివారించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ అన్నారు
శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ పొగాకు వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.పెద్దపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రంగంపల్లి మీదుగా కమాన్ వరకు, కమాన్ నుంచి మళ్లీ పెద్దపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం పొగాకు వ్యతిరేక దినోత్సవం థీమ్ అయిన పొగాకు సంస్థల జోక్యం నుండి పిల్లలను రక్షించడం దిశగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు
ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి ధూమపానం, పొగాకు వాడకమని అన్నారు. ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు మరెన్నో కారణంగా చాలా మంది ఈ అలవాటును ఎంచుకుంటారని, ఎవరైనా సిగరెట్ తాగినప్పుడు, వారు తమను తాము మాత్రమే కాకుండా చుట్టుపక్కల వారందరికీ హాని చేస్తారని అన్నారు .పొగాకు వాడకం మానవ శరీరంపై అనేక దుష్ప్రభావాలను చూపుతుందని తెలిపారు
పొగాకు ఉత్పత్తుల నిషేద చట్టం పై అవగాహన కలిగి అందులోని నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, పొగాకు ఉత్పత్తుల నిషేద చట్టాల ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పొగాకు సేవించడం నిషేధమని అతిక్రమించిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే బడుతుందని అన్నారు
విద్యాలయాల చుట్టూ 100 గజముల లోపు పొగాకు సేవనం, ఉత్పత్తులపై అమ్మకం నిషేదమని, అతిక్రమించిన వారిని జరిమానా,18 సంవత్సరాల లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తుల అమ్మకం, వారిచే అమ్మించడం నిషేదం ఆని, ప్రతి పొగాకు ఉత్పత్తులపై నిర్ణీత ఆరోగ్య హెచ్చరికలు ఉండవలెననీ, పొగాకు ఉత్పత్తు లో గల నికోటిన్ దాని మోతాదు సూచించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు
పొగాకు ఉత్పత్తులు ధూమపానం ద్వారా గాని లేదా నోటి ద్వారా గాని ఏ విధంగా సేవించిన ప్రమాదకరం వీటి వలన క్యాన్సర్ వ్యాదికి గురి అయ్యే అవకాశం ఎక్కవని, అందుకే మన జిల్లా ప్రజలకు పొగాకు వాడకం వలన కలిగే నష్టాలను అర్థం చేసుకొని పొగాకు వాడటం అలవాటు ఉన్నవారు, పొగాకు మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు
అనంతరం వైద్యారోగ్య సిబ్బందిచే పొగాకు ఉపయోగించం అని, పొగాకు వాడకాన్ని నిరోదించుటకు ప్రేరేపిస్తామని ప్రతిజ్ఞ చేయించారు
ఈ కార్యక్రమములో ప్రోగ్రామ్ అదికారి (ఎన్.సి.డి)డా. ఆర్. రాజమౌళి, జిల్లా కన్వీనర్ (ఐ.ఆర్.సి.ఎస్) కావేటి రాజగోపాల్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు డా. శ్రవణ్, డా. మమత,డా.స్వప్న, యం.ఎల్.హెచ్.పి. లు, డా.అభినయ్, డా. కీర్తన, డా. స్వాతి, యస్. వెంకటేశ్వర్లు, డిప్యూటి డెమో టి. రాజేశం, తిరుపతి రెడ్డి, ఎన్.సి.డి. ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ లు, శ్రీ యం. సాంబయ్య, యం.పి.హెచ్.
ఇ.ఒ లు రాగినేడు, రాఘవాపూర్ యం.ఎల్.హెచ్.పి.లు, సూపర్ వైజర్ లు, ఎఎన్ఎమ్ లు ఆశలు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The use of tobacco products should be avoided according to Dr. Pramod Kumar, District Medical and Health Officer