అక్రమంగా రవాణా చేస్తున్న దేశదారు బాటిల్స్ పట్టుకున్న టాస్కర్స్ పోలీసుల
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగుండం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ ఎస్సై మరియు సిబ్బంది కలిసి పట్టుకొని అతని వద్దనున్న బ్యాగ్ ను తనిఖీ చేయగా 200 దేశ దార్ బాటిల్స్ ని గుర్తించడం జరిగింది. వెంటనే అతని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు ఎర్కిచేతల రాజమల్లు పోచం, మహారాష్ట్ర అని మహారాష్ట్ర నుంచి రైలు మార్గం ద్వారా తీసుకోని వచ్చి రామగుండం చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మడం కోసం తీసుకువచ్చానని తెలుపడం జరిగింది. నిందితున్ని మరియు అతని వద్ద స్వాధీనం చేసుకున్న దేశదార్ బాటిల్స్ ని తదుపరి విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది.
ఎర్కిచేతల రాజమల్లు పోచం S/o. పోచం, 33 సంవత్సరాలు, బెస్త, ఆర్/ఓ. వడ్డం గ్రామం, సిరోంచ మండలం, గడ్చిరోలి, మహారాష్ట్ర
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App