TRINETHRAM NEWS

Trinethram News : బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది.

11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

2002నాటి గుజరాత్‌ అల్లర్లలో బిల్కిస్‌ బానో పై అత్యాచారానికి ఒడిగట్టిన 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ, గుజరాత్‌ ప్రభుత్వం గత ఏడాది తీసుకున్న నిర్ణయం చెల్లదని ధర్మాసనం తేల్చిచెప్పింది.

రేపిస్టులను విడుదల చేసే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని కరాఖండీగా చెప్పింది.

11 మంది రేపిస్టుల విడుదలను సవాల్‌చేస్తూ, బిల్కిస్‌ బానో దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉందని సుప్రీం తెలిపింది.

సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో, 11 మంది రేపిస్టులు మళ్లీ జైల్లో లొంగిపోవడం ఖాయమైంది.