WhatsApp Image 2024 11 30 at 16.08.51
శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి జీవితం ఆనందంగా గడపాలి
ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐ ని సన్మానించి జ్ఞాపకాలు అందజేసిన సిపి
అధికారులకు, సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్
పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఐ ఫరీద్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) పాల్గొని పదవీ విరమణ పొందిన ఎస్ఐ కుటుంబ సభ్యుల తో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈరోజు పదవీ విరమణ పొందిన షేక్ ఫరీద్ ఎస్ఐ 1983 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై అంచలంచలుగా ఎదిగి 41 సంవత్సరముల,7 నెలలు విధులను నిర్వర్తించడం జరిగింది. 1987 సంవత్సరం లో ముఖ్యమంత్రి సౌర్య పతకం మరియు 2021 సంవత్సరం లో సేవా పతకం ను పొందారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. ఉద్యోగ విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఎఆర్ సుందర్, ఏ ఓ అశోక్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, వామన మూర్తి, శ్రీనివాస్, మల్లేశం, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
