The raging Godavari at Bhadrachalam
Trinethram News : భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు చేరటంతో ప్రవాహం పెరుగుతోంది.
భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఉదయం 8 గంటలకు భద్రాచలం దగ్గర 31.5 అడుగులకి నీటిమట్టం చేరుకుంది.
ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండ టంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతా లకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే రామాలయం స్నానాల ఘాట్ నీటి ముని గింది. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. వరద ఉధృతి నేపథ్యంలో ముంపు ప్రాంతా ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App