TRINETHRAM NEWS

ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలి

ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలి.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

అర్హులైన తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిండి b.r s. భారత రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షులు గిరా మోని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలని అర్హులైన వారందరికి 6 గ్యారంటీల పథకాలను అందించాలని లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇచ్చిన హామీలను ఏకపక్షంగా వ్యవహరించకుండా గ్రామాలలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అర్హులైన వారందరికీ అందించాలని కోరారు.

సర్పంచ్ ఎన్నికల కోసం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలను ప్రజలను మోసపూరితపు మాటలతో కాలయాపన చేస్తే ప్రజలు, ప్రజల తరపున మేము ఊరుకోము, ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులైన వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, అర్హులైన పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలని, ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సంవత్సరానికి ఎకరాకు 12 వేల రూపాయలు ఇవ్వాలని ఆరుగారెంటీల పథకాలను సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేని పక్షాన రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో గ్రామాలలో కాంగ్రెస్ లీడర్లను ప్రజల తరఫున నిలదీస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App