WhatsApp Image 2024 02 07 at 2.42.42 PM
Trinethram News : అన్నమయ్య జిల్లా, నిమ్మనపల్లె
నాటు సారా అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. నిమ్మనపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డి కథనం మేరకు.. మండలంలోని అగ్రహారం గ్రామం, చింతపర్తి వారిపల్లికి చెందిన ఆర్. వెంకటరమణ (56) స్థానికులకు నాటు సారా విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. పక్కా సమాచారంతో వెళ్లి వెంకటరమణ ఇంట్లో సోదాలు జరపగా 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేయనుకుని సీజ్ చేసి, కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేశామని ఎస్ఐ తెలిపారు.
