అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మొగుళ్లపల్లి మండలం: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(మంగళవారం) భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 36 మంది కళ్యాణలక్ష్మీ మరియు షాదీముబారక్ లబ్దిదారులకు రూ.36,04,176 విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలనలో అర్హులైన వారికి అభివృద్ది, సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేక, ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రోజుకు 18 గంటల కష్టపడుతున్నట్లు తెలిపారు.
యంజేపీ స్కూల్ లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లో తిరుగుతూ విద్యార్థుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వారి ఎదుర్కొంటున్న సమస్యలను విని, వాటిని త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా నీటి సమస్య ఉందని విద్యార్థులు తెలుపగా, మిషన్ భగీరథ డీఈఈ సంధ్య కు ఎమ్మెల్యే ఫోన్ చేసి మిషన్ భగీరథ నీటిని రెగ్యులర్ గా ఇచ్చేలా చూడాలని కోరారు. అనంతరం ఈడబ్ల్యూఐడీసీ ఏఈ జీవన్ కు ఎమ్మెల్యే ఫోన్ చేసి స్కూల్లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఎస్టిమేట్స్ లను ఈరోజే వేసి తీసుకురావాలని ఆదేశించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App