WhatsApp Image 2024 06 14 at 18.38.56
The journalist sent the photo to Telangana CM Revanth Reddy
Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్..
ఉచిత ప్రయాణ పథకం వల్ల
స్కూలుకు వెళ్లగలుగుతున్న పిల్లలు
చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ సంతోషం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓ జర్నలిస్ట్ పంపిన ఫోటో సంచలనంగా మారింది. ఆ ఫోటోలను సీఎం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉందంటూ తెలిపారు. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారంటూ చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే.. చాలా ఆనందం వేసిందని తెలిపారు. ఒక జర్నలిస్టు మిత్రుడు ఈ ఫోటో తీసి నాకు పంపాడు. అది చూసిన నాకు చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్ వేదిగా పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
