జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 01 at 4.55.27 PM

TRINETHRAM NEWS

Trinethram News : దేవరపల్లి,
తేదీ 01.03.2024.

రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శుక్రవారం నల్లజర్ల మండలం పర్యటనలో భాగంగా గౌరీపట్నం వెళ్తున్నారు. మార్గమధ్యలో దుద్దుకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహన దారుడికి గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న తానేటి వనిత వెంటనే కాన్వాయ్ ఆపి క్షతగాత్రుడుని పరామర్శించారు. కంగారుపడాల్సిన అవసరం లేదని అతనికి దైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందితో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. అనంతరం క్షతగాత్రుడు లింగాల వెంకట్రావు దుద్దుకూరు కు చెందిన క్వారీలో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. హోం మంత్రి చూపిన మానవత్వం పట్ల పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

జారీ చేసిన వారు : హోం మంత్రి వారి క్యాంపు కార్యాలయం, యర్నగూడెం.

You cannot copy content of this page