TRINETHRAM NEWS

అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింపజెయ్యాలి.

గర్భిణీ, బాలింతలకు ఇబ్బందులు లేకుండా చెయ్యాలి.

మాట ఇచ్చి మడమ తిప్పని సీయం జగన్ మాట నిలబెట్టుకోవాలి.

అంగన్వాడీల అమోదయోగ్యమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి

యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్‌ డిమాండ్..

రాష్ట్ర వ్యాప్తంగా గత 17 రోజులుగా అంగన్వాడీల సమ్మె జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలను చర్చలు జరిపి వారి న్యాయమైన, అమోదయోగ్యమైన కోర్కెలను తీర్చాలని యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదురుగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా మూవ్మెంట్ ఫర్ పీస్ & జస్టీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తకుండా ఉండటంతో గర్భిణీ మరియు బాలింతలకు పౌష్టికాహారం అందక ఇబ్బందులు గురౌతున్నారని, అలాగే చిన్న పిల్లలు విద్యాభ్యాసంకు దూరంగా ఉంటున్నారని, ప్రభుత్వంలోకి రాక ముందు ఒకమాట ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరోమాట, మాట ఇచ్చి మడమ తిప్పిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యమన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి అంగన్వాడీలకు గ్రాడ్యుటీ మరియు ప్రమోషన్స్ ఇవ్వాలని, వారికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పధకాలను వర్తింపజేయాలని, ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో యంపిజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ రసూల్, జిల్లా అధ్యక్షులు షేక్ ఖాశిం, జిల్లా సహాయ కార్యదర్శి పి మహబూబ్ ఖాన్, పట్టణ అద్యక్షుడు షేక్ అమీర్, షేక్ ఉమర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.