
హైద్రాబాద్ : అమీర్‌పేట, బాలికను బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై ఎస్సార్‌నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వారి వివరాల ప్రకారం.. అమీర్‌పేట-బల్కంపేట రోడ్డులోని సోనాబాయి ఆలయం సమీపంలో ఉంటున్న గణేష్ యాదవ్(20) అదే ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక(14)తో స్నాప్‌చార్ట్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వీడియోలతో బెదిరించి బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెండుసార్లు అత్యాచారం చేశాడు. మనస్తాపంతో బాలిక పాఠశాలకు వెళ్లడం లేదు. దీంతో తల్లి బాలికను ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు…..
