WhatsApp Image 2024 09 01 at 18.24.06
The councilor is negligent of the municipality machinery
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
పట్టించుకోని10వార్డ్ ప్రజలను.
పట్టణ పరిధిలోని 10 వార్డ్ లోని గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటితో నిండుకుండలా మారింది ఇది కేవలం మున్సిపాలిటీ యంత్రాంగ నిర్లక్ష్యం అని వార్డ్ ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ వార్డ్ పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు మున్సిపాలిటీ ఆఫీస్ సివిల్ హాస్పటల్, పోలీస్ స్టేషన్ మొదలుకొని ఈ వార్డ్ లో ఉన్న పట్టించుకోకుండా గతంలో వార్డ్ పరిస్థితిల గురించి పలుమార్లు సంబంధిత అధికారులకు, కౌన్సిలర్ కు విన్నవించిన అప్పటి కమిషనర్ కు చైర్మన్ కు వినతి పత్రాలు అందజేసిన ఇప్పటివరకు ఈవార్డ్ పరంగా ఎలాంటి మార్పులకు చోటు చేసుకోలేదు స్థానిక ప్రజ లు మున్సిపాలిటీ యంత్రాంగంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదివరకు ఉన్న డ్రైనేజ్ ను కూల్చివేయగా ఈ మురుగునీరు వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలైనటువంటి పదో వార్డ్ లోకి ఇండ్లలోకి నీరు వచ్చి చేయడం జరిగింది.
అంతేకాకుండా బయటకి వెళ్దాము అని అంటే వెళ్లలేని పరిస్థితిగా సరైన రోడ్డు లేకపోవడం రాత్రి వేళ అయితే కరెంటు స్తంభాలు లేక లైట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
విషపూరితమైన విమకిటకాలు తో సహజీవనం చేస్తున్న స్థానిక ప్రజలు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని 10వార్డ్ ప్రజలు కోరుతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
