జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 29 at 9.31.31 PM

TRINETHRAM NEWS

-కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లు అమలు చేస్తున్నాం

-ప్రజా ప్రభుత్వాన్ని ఎంత మంది ఎన్ని కుట్రలు చేసిన ఏమి చెయ్యలేరు

-ములుగు మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వర్యులు సీతక్క గారు

ఈ రోజు ములుగు మండల కేంద్రములో జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ mlc ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడి పని చేసి మన అభ్యర్థులను గెలిపించుకోవాలని గడిచిన 10 యేండ్ల కెసిఆర్ పాలనలో అప్పులు చేసి లక్ష కోట్ల తో కాళేశ్వరం కట్టి బి ఆర్ ఎస్ నాయకుల జేబులు నింపుకున్న పరిస్థితి బీజేపీ, బిఆర్ఎస్ నాయకులు కుల బలుకొని కాంగ్రెస్ పార్టీని బాధనం చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాక ముందే 4 గ్యారంటీ లు అమలు చేసింది అని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుంది అని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

You cannot copy content of this page