TRINETHRAM NEWS

The commissioner has given a request to put 70 marks online exam

ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ స్పెషల్ గా ఫార్మసిస్ట్లు ,ల్యాబ్ టెక్నీషియన్స్లు 30 వెయిటేజ్ మార్క్స్ వెయిటేజ్ , 70 మార్కులు ఆన్లైన్ ఎక్సమ్ పెట్టాలని కమిషనర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది

18 సెప్టెంబర్ 2024 జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలి జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఎం)లో గత అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేయుచున్న ఉద్యోగులందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని ఎన్.హెచ్.ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం రాష్ట్ర కార్యాలయంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ ఎన్.హెచ్.ఎం. కాంట్రాక్ట్ పద్దతిన నియమించుకునే సందర్భంలోనే వీరికి రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ఆధారితంగా సెలక్షన్ చేయటం జరిగిందని, కరోనా లాంటి పరిస్థితుల్లో సైతం పేద ప్రజలకు అండదండగా ఉండి వారి సేవలను అందించి వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టినటువంటి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.

కాంట్రాక్టు చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనం కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వాలి అని ఉన్నప్పటికీ వీరికి అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని చట్ట ప్రకారం వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉండగా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నదని వారు విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఇప్పటికీ 10 నెలలు అవుతుంది కావున ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

ల్యాబ్ టెక్నీషియన్లను మరియు ఫార్మసిస్ట్లను అందరినీ పర్మనెంట్ అయ్యేందుకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నటువంటి జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులను విస్మరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని వారు తెలియజేశారు. ఉద్యోగులకు అధిక పనిభారంతో సతమతమవుతున్నారని అన్ని స్థాయిల్లో సరిపడా సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ పనిచేస్తున్న పద్ధతిని వెంటనే క్రమబద్ధీకరించాలని తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The commissioner has given a request to put 70 marks online exam