TRINETHRAM NEWS

చలి పంజా.. గజగజ..!

పటాన్‌చెరులో అత్యల్పంగా 6.4 డిగ్రీలు నమోదు

Trinethram News : హైదరాబాద్‌ : భాగ్యనగరంపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.

తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. సోమవారం పటాన్‌చెరు ప్రాంతంలో అత్యల్పంగా 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే కనిష్ఠం. ఇబ్రహీంపట్నంలో 6.7, మౌలాలి, హెచ్‌సీయూ ప్రాంతాల్లో 7.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీహెచ్‌ఈఎల్‌లో 7.4, రాజేంద్రనగర్‌లో 8.2, గచ్చిబౌలి 9.3, వెస్ట్‌ మారెడ్‌పల్లి 9.9, కుత్బుల్లాపూర్, మచ్చబొల్లారంలో 10.2, శివరాంపల్లిలో 10.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలిగాలులకు నగరంలో బైక్‌లపై వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గడిచిన కొన్నేళ్లతో పోలిస్తే ఇంతలా ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App