TRINETHRAM NEWS

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుపై పెద్దపల్లిసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి*

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్- సిఐటియు డిమాండ్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లి పర్యటనకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో సిఐటియు కార్యాలయంలో ఎస్సీ కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది
.ఈ సమావేశంలో
బి మధు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెల రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని ప్రకటించారని అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9వ తేదీ నాటికి ఏడాది కాలం పూర్తవుతుందని ఇప్పటివరకు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఎందుకు పెంచలేదు ?ఎప్పుడు పెంచుతారు ?ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 22 అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం లేఖ రాసి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు జీవో నెంబర్ 22 అమలుకు అవకాశం ఇవ్వటం లేదో సమాధానం చెప్పాలని ఎస్సీ కేఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. నాలుగు వేల కోట్ల రూపాయలు నికర లాభాలను ప్రకటించిన సింగరేణి యాజమాన్యం ఆ లాభాలు రావటానికి కారణమైన కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఎందుకు పెంచటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా దారిమల్లిస్తుందని విమర్శించారు. 26,000 మంది కాంట్రాక్టు కార్మికుల ఆకలి బాధలు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని పేర్కొన్నారు. డిసెంబర్ 9వ తేదీ నాటికి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని కోల్ ఇండియా వేతనాలు అమలు చేయటమా ?లేదంటే జీవో నెంబర్ 22న అమలు చేయటమా? ఏదో ఒక స్పష్టమైన ప్రకటనను పెద్దపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగరేణి పరిధిలో కాంట్రాక్ట్ కార్మికుల వెట్టిచాకిరి జరుగుతుందని సిఐటియు ఆందోళన వ్యక్తం చేసింది. ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేసింది .లాభాల కోసం కాంట్రాక్ట్ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని సిఐటియు పేర్కొన్నది ఎన్నికల ముందు ఓట్లు కోసం పదవుల కోసం నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని వాగ్దానాలు గుప్పించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఎస్సీ కేఎస్ ప్రశ్నించింది .డిసెంబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి సభలో ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన రాకపోతే కోల్ బెల్ట్ ప్రాంతంలోని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను కాంట్రాక్ట్ కార్మికుల పోరాట కేంద్రాలుగా మార్చుతామని, ఎమ్మెల్యేల పర్యటనలు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఎస్సి కేస్ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది .కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తు పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఐటియు హెచ్చరించింది.
ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎస్సీ కేఎస్ సిఐటియు నాయకులు కె.బ్రహ్మచారి,ఉల్లి మొగిలి ,రాజన్న,శారద,మహేందర్,శేఖర్,శారద,రాజేశం,పెద్ది లచ్చన్న, వి రవి, ఎ రామన్న,కృష్ణమాచారి, భూక్యా రమేష్,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App