ట్రాన్స్ పోర్ట్ ఆటో కార్మికులను కఠినంగా శిక్షించే హిట్ అండ్ రన్ BNS సెక్షన్ 106(1)(2) రద్దు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి.
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ప్రతి నెలకు 5వేలు ఇవ్వాలి ప్రవేట్ ఫైన్స్ అధికారుల వేధింపులు ఆపాలి అధికారుల వేధింపులు ఆపాలి .. మే 20న జరిగే దేశవ్యాపిత సమ్మెలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి.
— AIRTWF- CITU ఆర్ మహిపాల్ జిల్లా అధ్యక్షులు
రోడ్ ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్ లను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన హిట్ అండ్ రన్ BNS సెక్షన్ 106 (1(2) లను రద్దు చేయాలని అల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF- CITU) CITU వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత (BNS) చట్టంలోని సెక్షన్ 106(1)(2) ల ప్రకారం రోడ్ ప్రమాదాలు జరగడానికి డ్రైవర్ లే కారణమని భావించి డ్రైవర్ లను కఠినంగా శిక్షించాలని 10 సంవత్సరాలు జైలు శిక్ష , ఏడు లక్ష రూపాయల ఫైన్ విధించే విధంగా తీసుకొచ్చిన సెక్షన్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.రవాణా రంగ కార్మికులు నిత్యం ప్రమాదాలకు గురౌతున్నారని,కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని కార్మికులను అదుకోవడం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
రోడ్ ప్రమాదాలలో మరణించిన,గాయపడిన ప్రమాద బీమా కంపనీల ద్వారా గతంలో బీమా వచ్చెదని నేడు బీమా పై కేంద్రం సిలింగ్ పెట్టి డ్రైవర్ లపైన ఫెనాల్టీ ఏడు లక్షల రూపాయలని వేసి కార్మికుల కు నష్టం చేసే నూతన మోటారు వాహన చట్టం-2019 ని సవరించాలని, కార్మిక హక్కులను కాలరాసే , పని గంటలు పెంచే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఇతర కార్మిక డిమాండ్స్ పై మే 20 న జరిగే దేశవ్యాపిత సమ్మెలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు ,సంఘటిత , అసంఘటిత , స్కీమ్ వర్కర్స్, అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
సమావేశంలో పోస్టర్ విడుదల చెయ్యడం జరిగింది. ట్రాన్స పోర్ట్ ఆటో యూనియన్.నాయకులు నర్సింలు MA రజాక్, జంగీర్ వెంకటయ్య జాఫర్ ,రియాజ్ నజీర్ ఖాళీల్ రాజు యాదయ్య జంగయ్య వెంకటయ్య నర్సింలు శ్రీనివాస్ యాదయ్య ఖాజా , రఫ్ఫాధ ఇమ్రాన్ షరీఫ్ ముస్తఫా రఫీ ముజ్జు మునీరు నర్సింలు
తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


