MLA KP Vivekanand : ధర్మం, న్యాయం, త్యాగానికి ప్రతీక అయిన వాసవీ మాత ఆశీస్సులు సమాజానికి ఎల్లప్పుడూ ఉండాలి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 126 – జగద్గిరిగుట్ట డివిజన్ జగద్గిరిగుట్ట పై గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. ధర్మం, న్యాయం, త్యాగానికి ప్రతీక అయిన వాసవీ మాత ఆశీస్సులు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకముందు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ నేటి శంకర్ గుప్తా, ఫౌండర్ చైర్మన్ రేగురి ప్రవీణ్ కుమార్ గుప్తా, గౌరవ చైర్మన్ కాశం కైలాసం గుప్తా, అధ్యక్షులు ఉప్పల రమేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు గుప్తా, ట్రెజరర్ మహంకాళి సురేష్ గుప్తా, అడిషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి స్వామి గుప్తా, జాయింట్ సెక్రెటరీ అంగడి సత్యనారాయణ గుప్తా, ఉపాధ్యక్షులు లక్ష్మీనరసయ్య గుప్తా, షెర్విరాల కృష్ణమూర్తి గుప్తా, పులిగిల్ల నర్సింహులు గుప్తా, గజ్జి ఉపేందర్ గుప్తా, డివిజన్ మైనార్టీ నాయకులు అజమ్, నాయకులు పాపులు గౌడ్, బాబు గౌడ్, మల్లేష్ గౌడ్, జైహింద్, బ్రహ్మానంద చారి, అంజయ్య, మహేందర్, నాని, విగ్నేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The blessings of Mother Vasavi

You cannot copy content of this page

Scroll to Top