TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా ఇంచార్జ్: ( మణిబాబు ) భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు),
పాడేరు మండల కమిటీ.

ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టాన్ని అమలు చేయాలి
మద్యం దుకాణాలు స్థానిక ఆదివాసీలకు మాత్రమే కేటాయించాలి

పీసా చట్టాన్ని ధిక్కరించి ప్రభుత్వం నిర్వహించిన, మద్యం దుకాణాలను రద్దు చేయాలని, సి.పి ఎం పార్టీ జిల్లా కార్యదర్శి  పి. అప్పలనరస రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

పాడేరు జిల్లా కేంద్రం లో సి.పి.ఎం కార్యాలయం లో సి.పి.ఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పలనరస మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు కేటాయింపు విధానం ఆదివాసీ చట్టాలను ప్రభుత్వం ఉల్లంఘించింది. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి మద్యం దుకాణాలు కేటాయించాలని, ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కనీసం గ్రామ సభ తో సంప్రదింపులు కూడ లేదని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 వ షెడ్యూల్డ్ ప్రాంతల్లో సుమారు 46 మండలాలు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉందని, మరికొన్ని మండలంలో పాక్షిక ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రకటించిన మద్యం దుకాణాలు కేటాయింపు విధానం ఆదివాసీ హక్కులు, చట్టాలను ఉల్లంఘించడం దారుణం. పీసా గ్రామ సభ ఆమోదం లేకుండ మద్యం దుకాణాలు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధం. 2011 లోనే పీసా నిబంధనలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉల్లంఘించింది.మద్యం దుకాణాలు ఏర్పాటు,లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభ కు మాత్రమే సంపూర్ణ అధికారం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా లో 40 మద్యం దుకాణాలకు సుమారు 2300 దరఖాస్తులు, పార్వతీ పురం మన్యం జిల్లా పరిధిలో 30 ప్రభుత్వ మద్యం దుకాణాలకు 2400 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడ గిరిజనేతరులు, సిండికేట్,లు బినామీ తో పాటు, మైదాన ప్రాంత గిరిజనులతో దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్టం మరియు సరిహద్దు జిల్లా లో ఉన్న వారుకూడా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో మద్యం దుకాణాలు కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వ కావాలని పీసా చట్టాలను ఉల్లంఘించడం, పీసా ఎన్నికల్లో నిర్వహించకుండా, వాయిదాలు వేస్తూ మద్యం దుకాణాలు కేటాయింపు ప్రక్రియ ప్రారంభించడం అన్యాయం. గత ప్రభుత్వం కన్న బిన్నంగా నూతన ప్రభుత్వ పాలన అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆచరణ లో మాత్రం, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదివాసీ హక్కులు ఉల్లంఘన పై ప్రతి పక్ష పార్టీలు, ముఖ్యంగా వైసీపి ఎమ్మెల్యే లు , ఎంపి లను ప్రజలు గెలిపిస్తే కనీసం స్పందించడం లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.చిన్నయ్య పడాల్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎల్.సుందరరావు, పార్టీ నాయకులు కీల్లో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App