TRINETHRAM NEWS

ప్రధాని మోదీతో మస్క్‌ భేటీతో మారిన లెక్కలు

Trinethram News : అమెరికాకు చెందిన ప్రముఖ టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా.. ఎప్పట్నుంచో ఇండియన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తోంది. కానీ, కొన్ని ట్యాక్స్‌ల సమస్యల కారణంగా ఇంత కాలం భారత్‌లోకి టెస్లా రాక సాధ్యం కాలేదు.

కానీ, తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీతో, ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఉద్యోగ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.

అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీతో, ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత టెస్లా ఇండియాలో జాబ్‌ ఓపెనింగ్స్‌ ప్రకటించడంతో ఇక ఇండియన్‌ మార్కెట్‌లోకి టెస్లా రాకకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు అర్థం చేసుకోవచ్చు.

అయితే టెస్లా తొలుత తన కార్యకలాపాలను మొదట ముంబై, ఢిల్లీలో ప్రారంభించనుంది. టెస్లా తన లింక్డ్ఇన్ పేజీలో కస్టమర్ ఫేసింగ్‌ పోస్టులతో పాటు బ్యాక్ ఎండ్ పోస్టులకు సంబంధించి 13 పోస్టులు ప్రకటించింది.

పోస్టులు :

  • ఇన్‌సైడ్ సేల్స్ అడ్వైజర్
  • కస్టమర్ సపోర్ట్ సూపర్‌వైజర్
  • కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్
    సేవా సలహాదారు
  • ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్
    సర్వీస్ మేనేజర్
  • టెస్లా అడ్వైజర్
  • విడిభాగాల సలహాదారు
  • వ్యాపార కార్యకలాపాల విశ్లేషకుడు
    స్టోర్ మేనేజర్
  • సర్వీస్ టెక్నీషియన్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tesla announced job