Telangana Temperatures : 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

TRINETHRAM NEWS

అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీలు
మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ
25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. వడగాడ్పులపై కేంద్రం అడ్వైజరీ

Trinethram News : హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ రెండు జిల్లాలు మినహా రాష్ట్రమంతటా ఇప్పటికే 40 డిగ్రీలు దాటాయి. శుక్రవారం అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా… జగిత్యాల జిల్లా గోధూరు, గద్వాలలోని మల్దకల్, మంచిర్యాలలోని జానకాపూర్, నల్గొండలోని దామరచర్ల, నిజామాబాద్‌లోని ధర్పల్లిలో 40.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక మరో నాలుగు జిల్లాల్లో 40.8, మూడు జిల్లాల్లో 40.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఒక్క హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 39.7 డిగ్రీలు రికార్డయింది. మరో రెండు మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఆయా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత రెండ్రోజులకు ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టొచ్చని చెప్పింది. ఏప్రిల్ 2, 3వ తేదీల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉండే చాన్స్ ఉందంది.

దేశంలో ఎండలు మండిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలకూ హీట్వేవ్ అలర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఎండ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వడగాడ్పులను అంచనా వేస్తుండాలని సూచించింది. హీట్వేవ్స్‌పై వెంటనే యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని, వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై బులెటిన్స్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. మెడికల్ ఆఫీసర్లు, హెల్త్స్టాఫ్ సంఖ్యను పెంచాలని సూచించారు. వడదెబ్బకు గురైన పేషెంట్లకు చికిత్స అందించేలా హాస్పిటళ్లను సిద్ధం చేయాలని, అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఆదేశించారు. యాక్టివ్, ఎమర్జెన్సీ కూలింగ్ పరికరాలను ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆస్పత్రుల్లో ఫైర్సేఫ్టీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓఆర్ఎస్, మందులు, ఫ్లూయిడ్లు (సెలైన్లు), ఐస్ప్యాక్‌లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. హీట్స్ట్రోక్ మేనేజ్‌మెంట్యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Temperatures exceeding 40 degrees

You cannot copy content of this page

Scroll to Top