తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టిఐ కమిషనర్లను నియమించాలి
Trinethram News : హైదరాబాద్
సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమించాలని మాదగోని సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని సమాచార హక్కు చట్టం సాధన కమిటి జాతీయ కార్యాలయంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ మరియు రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సూర స్రవంతి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మాదగొని సత్యం మాట్లాడుతూ ఆర్టిఐ కమిషనర్ ఆఫీస్ లో కమిషనర్ లు లేక వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అని అన్నారు. కావున ప్రభుత్వం వెంటనే ఆర్టిఐ కమిషనర్లను నియమించాలి అని అన్నారు.అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్లను వెంటనే నియమించాలి అని అన్నారు. తెలంగాణ లో వివిధ రకాల ప్రభుత్వ కార్యాలయలలో ఎన్నో ఆర్టీఐ దరఖాస్తులకు సరైన సమాధానాలు ఇవ్వకుండా ఆర్టీఐ కార్యకర్తలకు అధికారులు స్పందించక నిర్లక్ష్యం చేస్తూ దరఖాస్తులు వేలల్లో పెండింగ్ లో ఉన్నాయి అని అన్నారు. ఆర్టీఐ దరఖాస్తులకు స్పందించి తక్షణమే పరిష్కారం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం,తెలంగాణ మహిళా కార్యనిర్వహక అధ్యక్షురాలు జి.ప్రియ రెడ్డి,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తుల మహేష్ గౌడ్,యాదగిరి ముదిరాజ్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App