Telangana coal mines are big industrialists
దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని
రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు శనివారం సాయంత్రం గోదావరిఖని ఆర్ జీ వన్ జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అంటూ గులాబీ శ్రేణులు నినదించాయి బొగ్గు గనుల వేలం ప్రక్రియ వెంటనే నిలిపి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సింగరేణి సంస్థ గత 135 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, దేశ అవసరాలకు అనుగుణంగా, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బొగ్గు వెలికితీస్తున్నదని అన్నారు.
గనుల వేలం పాట నుండి తెలంగాణలోని బొగ్గు గనులను మినహాయించి, సింగరేణిలో కొత్తగా ఉపాధి పొందిన 20వేల మంది ఉద్యోగుల భవిష్యత్తును కాపాడటం తో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని కూడా సంరక్షించాలని డిమాండ్ చేశారు.
దేశ విద్యుత్తు అవసరాలను తక్కువ ఖర్చుతో తీరుస్తున్న సింగరేణి సంస్థను కాపాడుకోవడం మనందరి తక్షణ కర్తవ్యం అన్నారు.
సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం, కొత్త బొగ్గు గనులను సింగరేణి ఆధ్వర్యంలోనే ప్రారంభించడం కోసం సమ్మెతో పాటు, ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కోన్నారు. ఆర్ జీ వన్ ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, ఎల్. వెంకటేష్, పోలాడి శ్రీనివాసరావు, మోదుంపల్లి రాజేశం, దూట శేషగిరి, చెలుకలపల్లి శ్రీనివాస్, బొగ్గుల సాయి, ఉప్పులేటి తిరుపతి, దిడ్డి లక్ష్మణ్, పల్లే సురేందర్, గోపి, పులిపాక శంకర్, జనగామ మల్లేష్, రొడ్డ సంపత్,గడ్డి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App