
Trinethram News : భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యమగామి బుచ్ విల్మార్ భూమికి చేరుకున్న సందర్భంగా తేజ విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ, మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమిని చేరుకున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారుజామున వీరిని ఫ్లోరిడా తీరంలో దింపింది.
గంటకు 17 వేల మైళ్ళ వేగంతో బయలుదేరిన డ్రాగన్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ భూమిని చేరుకునే సమయానికి గంటకు 116 మైళ్ళ వేగంతో నాలుగు పారాషూట్ల సహాయంతో వేగాన్ని మరింత తగ్గించుకుని భూమిని చేరింది.
ఈ సందర్భంగా స్థానిక తేజ టాలెంట్ స్కూల్ ఫిజిక్స్ విభాగం అధిపతి ఎస్.ఎల్.ఎన్ సార్ సారద్యంలో సునీత విలియమ్స్ మరియు వ్యోమగాములు గురించి విద్యార్థులకు వివరించనైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జానకి రామయ్య, ప్రిన్సిపల్ అప్పారావు, వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
