
ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడా?
Trinethram News : ఖమ్మం జిల్లా :ఫిబ్రవరి 20. ఈతకు వెళ్లిన హోంగార్డు ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి డిగ్రీ కాలేజ్ సమీపంలో మినీహైడల్ పవర్ ప్రాజెక్టు వద్ద అటుగా వెళ్లిన స్థానికులు కాలువలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచార మిచ్చారు.అనంతరం మృతదేహాన్ని బయటకు తీశారు.
మృతుడు మండల కేంద్రం లోని పీఎస్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డు గంటా నరేష్ (36)గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
