Trinethram News : దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆయన కుమార్తె సునీత (Suneetha Narreddy) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు..
ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. శివశంకర్‌కు తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది..