
ధర ఖాస్తులకు మహిళా రైతులనుండిఆహ్వానం మండల వ్యవసాయ అధికారి రెహానా.
డిండి(గండ్లపల్లి) మార్చి 24 త్రినేత్రం న్యూస్. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 మహిళా రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పై ఉప -మిషన్. పథకం ద్వారా 50%రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి. రెహానా ఒక ప్రకటనలో తెలియజేశారు, మండలంలోని మహిళా రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.మొత్తం 17యూనిట్లు మండల పరిధిలో రాయితీపై అందించ నున్నమని తెలిపారు.
5బ్యాటరీ స్పేయర్లు ,,తైవాన్ స్పెయర్లు05,రోటోవీటర్లు 03,కల్టీవీటర్ కేజీ వీల్ లు 03, సీడ్ కమ్ ఎరువుల డ్రిల్1, వున్నాయన్నారు. రాయితీ నీ పొందేందుకు మహిళల పేరు మీద భూమి నమోదై వుండాలి. భూమి పాస్ బుక్,ఆధార్ కార్డు,ట్రాక్టర్ ఆర్ సి ,(ట్రాక్టర్ సంబంధిత పనిముట్లకు మాత్రమే) దరఖాస్తులు ఈనెల 31 తేదీ లోపల అసిస్టెంట్ వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలి.ఆసక్తి గల మహిళా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సంవత్సరం కేవలం మహిళా రైతులకు మాత్రమే ఇవ్వబడును. ఈ రాయితీని పొందేందుకు మహిళల పేరు మీద భూమి నమోదు ఉండాలి.
ట్రాక్టర్ పరికరాల కోసం అప్లికేషన్ చేసేవారు ఆర్ సి ఆడవారి పేరు మీద లేకున్నా భర్త పేరు మీద ఉన్న దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని,
దరఖాస్తులకు చివరి తేదీ 31-03-2025 సాయంత్రం ఐదు గంటల వరకు.అనిఈ సందర్భంగా డిండి మండల వ్యవసాయ అధికారి అధికారి రెహానా తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
