Trinethram News : మేడ్చల్ జిల్లా నార్త్ సిటీ స్కూల్ లో నీటి సంరక్షణ అవగాహన పై విద్యార్థులకు వివరించారు, వేసవికాలంలో నీటి కొరత ఉండకూడదు, హైదరాబాదు మరో బెంగుళూరు కాకూడదు అనే సదుద్దేశంతో నీటి పొదుపు పై అవగాహన కల్పిస్తూ,,, నీటి సంరక్షణ పై విద్యార్థులు చే ప్రతిజ్ఞ ప్రమాణం మరియు
వేసవి సెలవుల్లో తన పిల్లలను జలాశయకు గాని,కాలువ గట్టుకు కాని చెరువుల వద్దకు పంపము జాగ్రత్తగా చేసుకుంటామని తల్లిదండ్రులు చే ప్రమాణం చేయుంచిన సామాజిక కార్యకర్త ,పర్యావరణ ప్రేమికుడు రవీందర్….
రాబోవు తరాలకు నీటి కొరత ఉండకూడదు,,, నీటి ని ఎలా ఉపయోగించాలో తెలుపుతూ బట్టలు ఉతికిన నీరు ను బాత్ రూమ్ లో ,,,అంట్లు తోమిన నీటిని చెట్ల కు వాడాలి అని సూరారం లోని నార్త్ సిటీ స్కూల్ విద్యార్థుల చే వర్షపు నీటిని పొదుపు ఎలా చేయాలనే విధంగా విద్యార్థులకు విషయంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.అలాగే వేసవి సెలవుల్లో తమ పిల్లలను చెరువులు దగ్గరకు పంపమని తల్లిదండ్రులు చే ప్రమాణం చేయించారు..
దీనిని విద్యార్థులంతా అవగాహన చేసుకున్న తదుపరి భవిష్యత్తులో నీటిని వృధా చేయమని ప్రమాణం చేసారు..
ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికుడు రవీందర్ ముదిరాజ్, స్కూల్ ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు