TRINETHRAM NEWS

రోడ్ భద్రత లో నిర్లక్ష్యం గా వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం ప్రజా భద్రత లో రాజీ పడం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్ భద్రత మాసోత్సవాల ముగింపు సందర్బంగా పెద్దపల్లి పట్టణ కేంద్రం లో హెల్మెట్ అవగాహన హెల్మెట్ ర్యాలీ మరియు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం కు రామగుండం పోలీస్ కమీషనర్ ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

మొదటగా పెద్దపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ అవరణ నుండి ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీ ని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ మరియు సబ్ జడ్జి స్వప్నరాణి జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించినారు. అట్టి ర్యాలీ పోలీస్ స్టేషన్ నుండి జెండా, మసీద్, అమర్ నగర్, అయ్యప్ప జంక్షన్ ల మీదుగా నందన గార్డెన్స్ వరకు కొనసాగించినారు.

అనంతరం నందన గార్డెన్స్ లో ఆటో, లారీ, వ్యాన్, కార్ డ్రైవర్ లకు మరియు విద్యార్థిని విద్యార్థులకు రోడ్ భద్రత పై అవగాహన సదస్సు లో భాగంగా మొదట డ్రైవర్ లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినారు. వారికి అవసరమైన కళ్ల జోళ్ళ ను ఉచితంగా ఇమా పెద్దపల్లి వారి సహకారం తో అందజేస్తామని తెలిపినారు.

ట్రాఫిక్ పోలీసులు మరియు రవాణా శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ భద్రత కు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించి ప్రతి పాఠశాల మరియు కలశాలలలో ఏర్పాటు చేసి ఇంకా అవగాహన పెరిగేవిధంగా చేయాలని సూచించారు.

ట్రాఫిక్ అవగాహనా సదస్సు ను జ్యోతి ప్రజ్వలనా చేసి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ ఏ యుద్ధం లో జరగనంత ప్రాణ నష్టం మన నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలలో జరుగుతుంది అని అన్నారు.

పెద్దపల్లి ఏసీపీ మాట్లాడుతూ ఇకనుండి సబ్ డివిజన్ లో రోడ్డు భద్రత విషయం లో కఠినంగా వ్యవహరించి రోడ్ ప్రమాదాలు జరుగకుండా చూస్తామని ఎటువంటి పైరవి లకు తావివ్వమని తెలియజేశారు.

అడ్మిన్ డీసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో జరిగే నష్టం ఎక్కువైనందున రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను వారం నుండి నెల రోజుల వరకు పెంచినారని అందరూ అవగాహన పెంచుకుని నియమాలు పాటించాలని తెలియజేశారు.

డీసీపీ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పోలీస్ కోసం కాదు, పోలీస్ కనిపిస్తేనే నియమాలు పాటిస్తాం అనే నిర్లక్ష వైఖరీ మానుకుని యువత ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు సేఫ్టీ పాటిస్తూ సక్రమ మార్గం లో వెళ్లినట్లయితే జీవితం లో ముందుకు వెళ్తామని తెలియజేశారు.

జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రజలందరు చట్టం గురించి తెలుసుకుని చట్టప్రకారం నడుచుకోవాలని కొత్త చట్టాల ప్రకారం జరిమానాలు మరియు శిక్షలు పెరిగినాయని నిర్లక్ష్యం గా వ్యవరిస్తే చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని వాటి అమలులో ఎక్కడ వెనుకాడబోమని, మద్యం సేవించి వాహనాలు నడిపితే తీవ్రమైన నేరం గా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

సీపీ మాట్లాడుతూ హెల్మెట్ ర్యాలీ నిర్వహించె సమయంలో చాలా మంది వాహనదారులు మరియు కుటుంబ సభ్యులతో పరిమితి కి మించి వెళుతు 90% మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం గమనించడం జరిగింది అని అన్నారు. రోడ్డు భద్రత భద్రత లో వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వారితో పాటు ఇతరులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉందని అటువంటి వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించ వద్దని, కఠిన వైఖరి తో ఉండాలని చట్టాన్ని గౌరవించి నియమాలు పాటించినవారికే సహకారం అందించాలని తెలియజేశారు.
ఇట్టి నిర్లక్ష్యపు వైఖరిలా వల్ల ప్రమాదాలు జరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలియజేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికీ జరిమానాలు విదిస్తున్న ప్రజలు జరిమానాలు కడుతున్నారు కాని వారిలో మార్పు రావడం లేదు,డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి పట్టుబడిన వారిని కోర్టు లో ప్రవేశపెట్టడం తో వారికీ జైలు శిక్ష, జరిమానా మరియు సోషల్ సర్వీస్ చేపించడం జరుగుతుంది అయినా కూడా వారు మరల పట్టుపడడం జరుగుతుంది. ఇండియా లో 90% మంది వాహనాలు వాడుతున్న వారిలో చాలా వరకు హెల్మెట్ వాడడం లేదు ప్రమాదం జరిగి చనిపోయిన సందర్భం లో హెల్మెట్ వాడకుండా తలకు బలమైన గాయం తగిలి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండి అన్నారు. వాహనాల తనిఖీ, అవగాహనా సదస్సు లలో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత పాటించకూడా, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ లో వాహనాలు నడిపితే వాహనాలు సిజ్ చేస్తామని హెచ్చరించాలి అని అధికారులకు సూచించారు.

ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ఖాకీ చొక్కా విధిగా ధరించడంతో పాటు లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలకు కారణం కావద్దని డ్రైవర్లకు సూచించారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో సత్ప్రవర్తనతో మెలుగాలని,రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపవద్దని సూచించారు. ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకునే సమయంలో, దింపే సమయంలో రోడ్డు పక్కన ఆపాలని, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపకుండా ఆటో స్టాండ్ లలో మాత్రమే నిలపాలని కోరారు. వాహనం నడిపే సమయంలో డ్రైవింగ్ పై శ్రద్ద వహించాలని, అలా కాకుండా భారీ శబ్దాలతో కూడిన మైక్ సెట్లను అమర్చి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించవద్దని హెచ్చరించారు.

అనంతరం ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా వాహనాలు నడిపిన డ్రైవర్లను ఘనంగా సన్మానించినారు. కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీ వారి సహాయంతో మున్సిపల్ కార్మికులకు మరియు పాత్రికేయులకు హెల్మెట్ లను ఉచితంగా అందజేసినారు

ఇట్టి కార్యక్రమం లో డీసీపీ పెద్దపల్లి చేతన ఐపిఎస్., జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ మరియు సబ్ జడ్జి స్వప్నరాణి గారు , అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రాజు,పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ జానీ నర్సింహులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, సీఐ ప్రవీణ్ కుమార్, జిల్లా రవాణా అధికారి రంగా రావు, అంవి మధు మరియు సిబ్బంది, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు బొంకూరి నర్సయ్య, తహేర్, అజ్గర్, రెడ్డి మరియు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App