Stray Dogs : వీర విహారంగా తిరుగుతున్న వీధి కుక్కలు : బడి పిల్లలు భయాందోళన

TRINETHRAM NEWS

వీధి కుక్కలను పట్టించుకునే వారే లేరు

పిల్లల తల్లిదండ్రులకు భయం భయం

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట గ్రామంలో ఉన్న శ్రీ గౌతమి పబ్లిక్ స్కూల్, రోడ్ లో చిన్నారులు బడికి నడుచుకుంటూ వెళ్తూ ,వస్తూ ఉంటారు.సాయంత్రం సమయంలో రోడ్లపైకి వీధి కుక్కలు వీర విహారం చేస్తుంటాయి. సాయంత్రం సమయంలో బడి నుంచి ఇంటికి వెళ్లాలంటే రోడ్డుపై పెద్దవారు ఎవరైనా ఉంటే బడి నుంచి పిల్లలు ధైర్యంగా ఇంటికి వెళ్తారు. ఎవరూ లేని సమయంలో పెద్దవారు వచ్చిందాకా ఉండవలసిన పరిస్థితి. పిల్లలను బడికి పంపించాలంటే వీధి కుక్కలతో భయమేస్తుంది. పిల్లలను వదిలి ఒంటరిగా పంపించాలంటే కుక్కలు దాడి చేస్తాయేమోనని పిల్లలు బడికి వెళ్ళమంటున్నారు. వీధి కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటున్నాయి. బడికి పంపించాలంటే మా పనులు అన్ని మానుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ వారిని గ్రామస్తులు కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Stray dogs roaming freely

You cannot copy content of this page

Scroll to Top