
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 8 త్రినేత్రం. చౌక ధరల దుకాణాలలో స్టాప్ వివరాలతో కూడిన పట్టికను విధిగా ప్రదర్శించాలి. ఎన్ని కుటుంబాలు ఆహార భద్రత కార్డు కలిగి ఉన్నాయి ఇప్పటివరకు ఎంతమందికి బియ్యం పంపిణీ పూర్తయింది ఇంకా ఎంతమందికి పంపిణీ చేయాల్సి తదితర వివరాలు స్టాక్ డిస్టర్బ్లో ప్రదర్శించాలని నిబంధన ఉన్న అవి ఏ రేషన్ డీలర్ పాటించడం లేదు.
రేషన్ షాపుల లోని బియ్యం నిలువలు, వాటి నాణ్యతను స్టాక్ వివరాలు పట్టికను తనిఖీ చేసే అధికారులే కరువయ్యారు. ప్రభుత్వం పేద కుటుంబాల వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్న నేపథ్యంలో పారదర్శకత కోసం రేషన్ దుకాణాలలో తప్పనిసరిగా స్టాక్ వివరాల పట్టికను ప్రదర్శించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులలో విధిగా దీనిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సన్న బియ్యం పంపిణీలో అవకతవకలు జరగకుండా మండల మరియు డివిజన్, జిల్లా అధికారులు పర్యవేక్షణ జరపాలని అధికారులను కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
