-సంత్ సెవాలాల్ 285వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో జరిగిన శ్రీ సంత్ సేవాలాల్ జయంతి 285 వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
సంత్ సేవాలాల్ బంజారుల ఆరాధ్య దైవం అని
సేవాలాల్ తన పాటలు రచనల ద్వారా ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించాడు. అందులో ముఖ్యంగా బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశారు. అందుకే సంత్ సేవాలాల్ ఇతర కులాలవారికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచారు. సేవాలాల్ ప్రజల మూఢవిశ్వాసమైన జంతుబలికి తీవ్ర వ్యతిరేకి, జాతి జాగృతి కోసం ఎంతో హితబోధ చేశాడు. తన జాతి వారిని బ్రిటిష్ వారి నుంచి, ముస్లిం వారి నుంచి కాపాడిన ఘనుడు. అందుకే నేడు బంజారా జాతి ఆయన జయంతిని జరుపుకుంటున్నారు
మంత్రి సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్,తో పాటు కమిటీ సభ్యులు డిఎస్పీ రవీందర్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు