
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 24 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా శిల్ప బృందావనంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం మూడవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక యాగాలు, యజ్ఞాలు, స్వామి వారి కల్యాణం, బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.
దీనిలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సీతరాముల కల్యాణం వేడుకలకు ముఖ్యాతిధులుగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఏ. సి చైర్మన్ అరేకపూడి గాంధీ మరియు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శిల్పాబృందావనం కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
