జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 25 at 19.33.58 1

TRINETHRAM NEWS

అథ్లెటిక్స్ లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని
శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అథ్లెటిక్స్ లో తమ ప్రతిభను కనబరిచారు. ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన ప్రభుత్వ జూనియర్ కళాశాల పెద్దపల్లిలో జరిగిన పోటీలలో
శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అయిన మిథున, మికుల్, అవంతిక, రేహాన్, వర్షిత్ లు తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను అభినందిస్తూ వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. వీరితో పాటు ఏజిఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు మరియు డీన్ లు , ఇంఛార్జ్ లు విద్యార్థులను అభినందించారు.ఈ విధంగా తమ పాఠశాల విద్యార్థులు విజేతలు కావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page