జూలై 7, 2026

WhatsApp Image 2024 11 26 at 18.32.06

TRINETHRAM NEWS

శ్రీ చైతన్య విద్యార్థుల ట్రాఫిక్ అవగాహన ర్యాలీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పట్టణంలోని
చైతన్య పాఠశాల విద్యార్థులు పట్టణ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించవలసిందిగా, ట్రాఫిక్ సిగ్నల్ రూల్స్ పాటిస్తూ వాహనాలను సురక్షితంగా నడపవలసిందిగా సూచించారు. విద్యార్థులు ర్యాలీలో నిర్వహిస్తూ ట్రాఫిక్ రూల్స్ మరియు సురక్షిత డ్రైవింగ్ పై అవగాహన కల్పించి, అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం, సీటుబెల్టు ధరించడం మొదలైన వాటిని ప్లకార్డులు, నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని వారికి పుష్పగుచ్ఛాలు అందిస్తూ హెల్మెట్ ధరించవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు డీన్ లు, ఇంఛార్జిలు, ఉపాధ్యాయులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page