TRINETHRAM NEWS

రంజాన్ సోదర భావాన్ని పెంపొందిస్తుంది.
తహసిల్దార్ అంబటి ఆంజనేయులు.

డిండి(గుండ్లపల్లి) మార్చి 29 త్రినేత్రం న్యూస్. డిండి పట్టణ కేంద్రంలోని మైనార్టీ షాది ఖానా లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాల నాయక్ ఆధ్వర్యంలో నేడు శనివారం రోజు ఇఫ్తార్ ఏ దావత్, కార్యక్రమమునకు విచ్చేసిన డిండి మండలం తాసిల్దార్ అంబటి ఆంజనేయులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు ఘనంగా వారికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ పవిత్ర మైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్టతో కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారని పేర్కొన్నారు. ఈ రంజాన్ మాసం సమాజంలో సామరస్యాన్ని సంతోషాన్ని పెంపొందిస్తుoదని తెలిపారు. కులమతాలకు అతీతంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
అదేవిధంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. డిండి మండలం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ దిండి మండలంలోని కులమత బేధాలు లేకుండా హిందూ ముస్లిం భాయి భాయిగా ఐక్యమత్యంతో ఉంటారని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సంక్షేమం కొరకు ప్రభుత్వం తోడ్పడుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గడ్డమీద సాయి, ఢిల్లీ మైనారిటీ కమిటీ చైర్మన్ షేక్ ఉమర్, అబ్దుల్ కలీం, రషీద్, ఖయ్యాం, సోహెల్, షబ్బీర్ ఇస్మాయిల్, నజీర్, మహమ్మద్, రిజ్వాన్, మరియు ప్రభుత్వ అధికారులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Special Iftar feast for