బాపట్ల జిల్లా:
బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వార్షిక నేరాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ….
పోలీసు డిపార్ట్మెంట్ 2023 లో చేసిన పనులు
గతంలో కంటే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది
కిడ్నాప్, మర్డర్ లు 23 శాతం మేర తగ్గింది
దొంగతనం 70 శాతం మేర తగ్గింది
రాత్రి పూట పోలీసు సిబ్బంది బీట్ లు పెంచడం కోసం పాత నేరస్తులు పై నిఘా పెంచడం వల్ల సాధ్యమైంది
చీటింగ్ కేసులు తగ్గాయి.
దొంగతనాలు తగ్గాయి, రికవరీ శాతం పెరిగింది
2023 లో 70 శాతం డిస్పోజ్ చేశాం
దిశా యాప్ వాడకం వల్ల నేరాలు తగ్గాయి., మహిళా పోలీసు చేత దిశా యాప్ డౌన్లోడ్ చేపించి అవగాహన కల్పించాం
గంజాయి మీద మొదటి నుంచి తీవ్రంగా పరిగణించి అదుపుచేయగలిగాం
గంజాయి మీద 5 పిడి యాక్ట్ లు పెట్టాం
గంజాయి మీద ప్రత్యేకంగా సంకల్పం అనే ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, కళాశాలలో అవగాహన కల్పించాం
డ్రంక్ అని అండ్ డ్రైవ్ కేసులో నమోదు చేయడం వల్ల రోడ్డు యాక్సిడెంట్స్ తగ్గాయి
రౌడీ షీటర్ లపై ప్రత్యేక నిఘా ఉంచి ప్రతి వారం పోలీసు స్టేషన్ కు వచ్చి వెళ్ళేలా చేసి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాం
కోర్టు కేసులను ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి నిందితులకు శిక్షలు పడేలా చేయగలిగాం
నాటుసారా తయారీ, విక్రయాలు అదుపు చేసి వారికి పునరావాసం కల్పించడం జరిగింది
జిల్లాలోని పోలీసు సిబ్బంది సమిష్టి భాగస్వామ్యం తో నేరాల సంఖ్య తగ్గించగలిగాం
అనంతరం జిల్లా పోలీసు క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్