జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 26 at 12.09.21 PM 1

TRINETHRAM NEWS

జగన్ అంత ఈజీగా తన అధికారాన్ని వదులుకుంటారా..?

రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. అందులో కొందరికి స్థానచలనం కల్పించాలని చూస్తున్నారు. అయితే ఇది సాహసంతో కూడుకున్న పని అయినా.. బిజెపి అనుసరిస్తున్న ఫార్ములానే జగన్ కొనసాగిస్తున్నారు.

బిజెపి వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో 100 మంది ఎంపీ అభ్యర్థులను మార్చనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడు అదే ఫార్ములా ను జగన్ అనుసరిస్తున్నారు.
పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఎంపీలను ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఎటువంటి పట్టింపులకు పోకుండా సొంత వారిని సైతం పక్కన పెట్టేందుకు జగన్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.

విపక్షాలకు ఒక లెక్క ఉంటే.. జగన్ కు ఇంకో లెక్క ఉంది. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం ద్వారా ఎంతటి సాహసానికైనా జగన్ దిగుతారని సంకేతాలు పంపించారు.

చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు మించి తాను ప్రకటిస్తానని చెప్పుకొస్తున్నారు. టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపిని తేవాలని చంద్రబాబు భావిస్తుంటే.. దానిని అడ్డుకుంటూ వస్తున్నారు.

టిడిపి, జనసేన మధ్య పొత్తు కుదిరినా.. సీట్ల సర్దుబాటు వద్ద మడత పేచీ వస్తుందని భావిస్తున్నారు. ఓట్ల బదలాయింపు అంత సవ్యంగా జరగకుండా తన ప్రయత్నాలు చేస్తున్నారు.
సంక్షేమ పథకాలను పెంచాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించి పార్టీని పెట్టారు. కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేయడంతో పాటు తాను అనుకున్నది సాధించగలిగారు.

అటువంటి జగన్ తప్పటడుగులు వేయరని.. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

You cannot copy content of this page