కార్మికులకు ఏడవ తారీఖు లోపు వేతనాలు చెల్లించె విధంగా చర్యలు తీసుకోవాలి.
సి అండ్ ఎండి కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేత.
విఠల్ నగర్, పైవింక్లయిన్ ఏరియా ల్లో జరిగిన సమావేశాల్లో ఏఐటియుసి ఆర్జీ వన్ అధ్యక్షులు ఎం.ఎ.గౌస్ డిమాండ్.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో కాంట్రాక్టు కార్మికులు గా పని చేస్తున్న వారికి జేబిసిసిఐ నిర్ణయించిన హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని, ప్రతి నెలా 7వ తేది లోపు వేతనాలు చెల్లించె విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని గురువారం రామగుండం పర్యటనకు వచ్చిన సింగరేణి సి అండ్ ఎండి కి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగిందని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఆర్జీ వన్ అధ్యక్షులు ఎం.ఎ.గౌస్ పేర్కొన్నారు. శుక్రవారం గోదావరిఖని విఠల్ నగర్, పైవింక్లయిన్ ఏరియా ల్లో ఉన్న కాంట్రాక్టు కార్మికులను కలిసి అనంతరం జరిగిన వేర్వేరు సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి లో దాదాపు ముప్పై వేల మంది కార్మికులు పని చేస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం రామగుండం రీజియన్ లో పర్యటనకు వచ్చిన సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
సింగరేణి లో కాంట్రాక్టు కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదని, వారికి వేతనాలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెలా 7వ తేది లోపు చెల్లించాల్సిన వేతనాలు 20వ తారీకు వరకు కూడా చెల్లించడం లేదని, దీని వల్ల వారు సకాలంలో వేతనాలు అందక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి నెలా 7వ తేది లోపు చెల్లించె విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కాంట్రాక్టు కార్మికుల కు ఇవ్వాల్సిన సిఎంపిఎఫ్ చిట్టీలను ఇవ్వడం లేదని, దీని వల్ల కార్మికులకు పి.ఎఫ్.నిలువలు ఎంత ఉన్నాయో వారికి తెలవడం లేదని, వెంటనే వారికి సిఎంపిఎఫ్ చిట్టీ లను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్మికులకు యాజమాన్యం ప్రకటించిన ప్రమాద బీమా 40 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా కార్మికుడికి ఏ బ్యాంకు లో ఖాతా ఉన్నా వర్తించే విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా కార్మికులకు ప్రతి సారి ఇవ్వాల్సిన రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని, రక్షణ పరికరాలు ఇవ్వక పోవడం వల్ల వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు, వెంటనే వారికి యూనిఫాం, బూట్లు, హెల్మెట్ ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చట్ట ప్రకారం కార్మికులకు ఇవ్వాల్సిన లీవులు ఇవ్వడం లేదని, పైగా తప్పని సరి పరిస్థితుల్లో విధులకు హాజరు కాని కార్మికులకు పైన్ ల పేరుతో మస్టర్ కు 350 రూపాయలు జీతం లో కట్ చేస్తూ కార్మికుల పై ఆర్థిక భారం మోపుతున్నారని, ఈ విధానాన్ని రద్దు చేయాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
సింగరేణి లో కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య స్ట్రక్చర్ కమిటీ సమావేశం లో డిమాండ్ పెట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం చొరవ చూపాలని, లేనిచో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ఏఐటియుసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆర్జీ వన్ బ్రాంచి ఉపాధ్యక్షులు కోట వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు వరికొప్పుల కొమరమ్మ, దేవమ్మ, పద్మ, సారయ్య, మహేశ్, సంతోష్, రాజు, రమ, వనిత, సంధ్య, సత్తయ్య తో పాటు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


